{"source_sid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1609604876832","subsource":"done_button","uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1609604426879","source":"other","origin":"gallery"}

నేను 2001లో TRS పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగ పని చేస్తూ హన్మకొండ మండలము లోని అన్ని గ్రామాలలో జెండా గద్దెలు కట్టి TRS జెండాలు ఎగురవేసి కమిటీల నిర్మాణం చేసి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినాను. అందుకు పార్టీ నాకు హన్మకొండ మండలము నుండి ZPTC అభ్యర్థిగా పోటీ చేయుటకు అవకాశం ఇచ్చినది అట్టి ఎన్నికలలో ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అందుకు నేను కృతజ్ఞుడను అప్పటి నుండి పార్టీలో పలు బాధ్యతలను చేపట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధర్నాలు రాస్తారోకోలు, రైలు రోకోలు రాజీవ్ రహదారి దిగ్భందం, సకలజనుల సమ్మెలో, సాగర హరం మరియు మిలీనియన్ మార్చ్ లో KCR గారు నిర్వహించిన బహిరంగ సభలలో లాఠీ దెబ్బలు తిని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఉద్యమములో పాల్గొన్నాను. అంతే కాకుండా అర్బన్ పార్టీ ఆఫీసు బాధ్యతలు చేపట్టి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మీ యొక్క 2009, 2010 బై ఎలక్షన్స్ 2014 మరియు 2018 ఎన్నికలలో ఆర్థికంగా మరియు ఆర్గనైజేషన్ పరంగా మీ విజయం కోసం అహర్నిషలు పని చేసినాను 2016 GWMC ఎన్నికలలో 37వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది GWMC మేయర్ పదవి ఆశించాను.

ఉద్యమంలో సీనియారిటీ ఉన్నప్పటికి కొన్ని కారణాల రీత్య ఆ పదవి పార్టీ ఇవ్వలేక పోయింది, ఆ తర్వాత డివిజన్ లో అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజల యొక్క మన్ననలను పొందినాను ఉద్యమ కారునిగా మేయర్ పదవి రానప్పటికి పార్టీని గౌరవించి ఇంకేదైనా సముచిత స్థానం ఇస్తారని ఆశించాను. పార్టీ ఏ మాత్రం గౌరవించకుండా తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది 20 సం || పార్టీ ఆవిర్భావం నుండి చిత్త శుద్ధితో పని చేసినప్పటికి పార్టీ గుర్తించలేదు . కాబట్టి ఉద్యమ కారులకు TRS పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని ఉద్యమ ద్రోహులకు మాత్రమే ఉన్నత స్థానం కల్పిస్తున్నందున ఉద్యమ కారులు, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పటికి కోరుకున్న సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగ పార్టీ విధానాలు ఉన్నందున రాబోయే రోజులలో పార్టీ తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది కావున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మరియు క్రియాశీల సభ్యత్వానికి శాశ్వితంగ రాజీనామా చేస్తున్నాను .
అని కోరబోయిన సాంబయ్య లేక ద్వారా తెలిపారు…