గ్రేటర్ వరంగల్ 43, 44వ డివిజన్ల పరిధిలో నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 150మంది నాయకులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ చేరికలు తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.