హసనపర్తి గ్రేటర్ 58 వ డివిజన్ వంగపహాడ్లో గత కొన్ని నెలలుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిల్లా గ్రంథాలయాల సంస్థ డైరెక్టర్ సముద్రాల మధును వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పీఏసీఎస్ చైర్మెస్ మేరుగు రాజేశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం వంగపహాడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానానికి కట్టుబడి ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సముద్రాల మధుకు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో టీఆర్ఎస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జంగ కుమార్ యాదవ్, డివిజన్ యూత్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని వెంకటేష్ గౌడ్, డైరెక్టర్ సాధు ధనుంజయ, ఎల్లావుల రాజేందర్‌యాదవ్, దోమ కుమార్, జూలూరి రాజుకుమార్, ముస్కు దేవెందర్, మురళి, సతీష్, శ్యాం, అశోక్, వినోద్, పున్నం, రాజయ్య పాల్గొన్నారు…