భీమదేవరపల్లి: మండలం మాణిక్యాపూర్‌ గ్రామానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి ఎనగందుల వంశీ (17) తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవుకోకుండా ఎప్పుడూ టీవీ చూస్తున్నాడని వంశీని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన వంశీ తల్లిదండ్రులు బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఉరేసుకున్నాడు. వాళ్లు రాత్రి ఇంటికి వచ్చేవరకు ఎవరూ గమనించలేదు. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.