హన్మకొండ టైలర్ స్ట్రీట్ ప్రాంతంలో హత్యకు గురైన మహిళ కేసులోని ముగ్గురు నిందితులను బుధవారం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి బంగారు ఆభరణాలతో పాటు, 2లక్షల 71రూపాయలు మూడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ. ఈ నెల మూడువ తేదిన తెల్లవారుజామున హన్మకొండ టైలర్ స్ట్రీలో నివాసం వుంటున్న దోర్నం శారద, భర్త పేరు మల్లేశం, వయస్సు 38 సంవత్సరాలు హత్యతో పాటు, మృతురాలి కుమారుడు దోర్నం అఖిల్ వయస్సు 17 సంవత్సరాలు పై జరిగిన హత్యయత్నం జరిగిన సంఘటనపై వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా అదేశాల మేరకు హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి అధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి ఈ రోజు ఉదయం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన నిందితులను విచారించగా మృతురాలు శారద తన భర్త మరణించడంతో తన కూతురు, కుమారుడు అఖిల్ తో కల్సి హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ ప్రాంతంలో నివాసం వుంటూ జీవనోపాధి కోసం తాను నివాసం వుంటున్న ఇంటి క్రిందే కూరగాయల వ్యాపారం నిర్వహిస్తునేది. మృతురాలు కూతురు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుచుండగా, కుమారుడు నిఖిల్ మృతురాలితో కల్సి వుంటూ ఇంటి వద్దనే వుంటూ ఇంటర్మీడియట్ చదువుచున్నాడు. మృతురాలు తన కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే అదాయం తన ఇంటిలోని బీరువా భద్రపర్చుడం చేసేది. మృతురాలి అన్నకొడుకు ప్రధాన నిందితుడైన ఆడెపు ఆకాశ్ బాబు మిగితా ఇద్దరు నిందితులతో కల్సి చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సేవించడంతో నిందితుడుని తండ్రి మందలిమచడంతో నిందితుడు తన మేనత్తయిన మృతురాలి ఇంటిలో కొద్దిరోజులు ఆశ్రయం పొందాడు. ఇదే సమయంలో మృతురాలు తన కూమార్తె వివాహం కోసం తన ఇంటిలోని బీరువాలో డబ్బు మరియు నగలను భద్రపర్చడాన్ని నిందితుడు గమనించేవాడు. ఇదే క్రమంలో పధాన నిందితుడు ఆడెపు ఆకాశ్ బాబు తన చెడు వ్యసనాలకు అవసరమయిన డబ్బు లభించక పోవడంతో ఏ విధంగానైనా సులభంగా డబ్బు సంపాదించాలనికున్నాడు.

ఇందులో భాగంగా తన మేనత్త ఇంటిలో పెద్ద మొత్తంలో డబ్బు వుందని అ డబ్బును దొంగలించడం ద్వారా తన అవసరాలను తీర్చుకోవచ్చని ప్రణాళిను రూపొందించుకున్నాడు. ఇందు కోసం నిందితుడు ఈ నెల 03వ తేది తెల్లవారుజామున 3గంటల సమయంలో మృతురాలని ఇంటి వెనుక తలుపు తీసివుండటంతో దాని ద్వారా ఇంటిలోకి ప్రవేశించిన నిందితుడు అదే సమయంలో మెలుకుతో వున్న తన మేనత్తపై నిందితుడు ఒక్కసారిగా బండరాయితో దాడిచేసి బందరాయితో మృతిరాలి తలపై పలుమార్లు కొట్టి హత్య చేశాడు. అక్కడే గాఢ నిద్రలో వున్న మృతురాలు కుమారుడు నిఖిల్ పై నిందితుడు బంద రాయితో దాడి చేసి హత్యయత్నంకు చేశాడు.అనంతరం నిందితుడు సంఘటన జరిగిన గదిలో వున్న బీరువాలోని బంగారు నగలు, డబ్బును చోరీ చేసాడు. నిందితుడు గదిలోని బీరువా పడటంతో ద్వారా మృతురాలు మరణించినట్లుగా నమ్మించేందుకుగాను బీరువాలో కొద్ది మొత్తంలో డబ్బును వుంచి బీరువాను మృతురాలు మరియు తీవ్రంగా గాయపడిన వున్న మృతురాలి కుమారుడు నిఖిల్ పై పడేసి నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. మేనత్తను హత్యచేసి తరువాత నిందితుడు మిగితా ఇద్దరు నిందితులను సంప్రదించడంతో ఆ ఇద్దరు నిందితులు ప్రధాన నిందితుడు ఆడెపు ఆకాశ్ బాబుకు ఆశ్రయం కల్పించారు, ఇందుకోసం నిందితుడు చోరి చేసిన సొత్తు నుండి బాల నేరస్థుడు 51వేలు, మేకల మచ్చేందర్ ఒక లక్ష 50 వేల రూపాయలు తీసుకున్నారు.

హత్య అనంతరం పోలీస్ ప్రత్యేక బృందాలు నేరం జరిగిన ప్రాంతంలోని సి.సి కెమరాలతో పాటు, ప్రస్తుతం అందుబాటులో వున్న పోలీస్ టెక్నాలజీ వినియోగించుకోని దర్యాపు బృందాలు నిందితులను గుర్తించారు. పక్కాసమాచారం రావడంతో పోలీసులు ఈ రోజు ఉదయం కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్, ఎ.జి.ఆర్ గార్డెన్స్ వద్ద అద్దె ఇంటిలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి ప్రధాన నిందితుడి నుండి 63వేల9వందల నగదు, చేవి అభరణలు మరియు బాలనేరస్థుడు నుండి 51వేలు, మరోనిందితుడు మేకల మచ్చేందర్ నుండి ఒక లక్ష 50 వేల రూపాయలతో పాటు మూడు సెలఫోన్లు హత్యకు వినియోగించిన బండరాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆడెపు ఆకాశ్ బాబు మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సిసి కెమెరాలను ద్వంసం చేసిన కేసులో నిందితుడు.
ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, సుబేదారి ఇనన్స్ స్పెక్టర్ అజయ్, హన్మకొండ, సుబేదారి ఎస్.ఐలు శ్రీనివాస్, వేణుగోపాల్ తో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.