వరంగల్: డివిజన్ల రిజర్వేషన్లపై లెక్కలు వేస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు ఆధారంగా డివిజన్‌ రిజర్వేషన్‌ ఎలా ఉంటుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. తాజా మాజీ కార్పొరేటర్లు, కొత్తగా పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్న వివిధ పార్టీల డివిజన్‌ నాయకులు ఇదే పనిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశానుసారంగా వరంగల్‌ నగరంలోని 66 కొత్త డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను ఇటీవల విడులైంది. బల్దియా ప్రధాన కార్యాలయం, వరంగల్‌ ఆర్డీవో కార్యాలయంతోపాటు గ్రేటర్‌ పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచారు.