వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం అదనపు డి.సి.పిగా కె.వెంకటలక్ష్మి సోమవారం భాధ్యతలు స్వీకరించారు. 2010 సంవత్సరంలో డి.ఎస్పీగా పోలీస్ విభాగంలో చేరి మొదటగా ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజినల్ పోలీస్ అధికారిగా భాధ్యతలు చేపట్టడంతో పాటు, ఓ ఎస్.డి సి.సి.ఎస్ హైదరాబాదు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో పనిచేసారు. ఈరోజు అదనపు డి.సి.పిగా భాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకటలక్ష్మి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. రవీందర్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.