ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి సంతకం ఫోర్జరీ చేసి శ్రీరాం ఫైనాన్స్ లో రుణం తీసుకున్న వైనం. తీసుకున్న రుణం సకాలంలో కట్టకపోవడంతో ఉపాధ్యాయుడికి కోర్టు నోటీసులు. రికార్డు అసిస్టెంట్ చేసిన పనికి దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లు కోర్టులని ఆశ్రయిస్తున్న ఉపాధ్యాయుడు. వరంగల్ అర్బన్ డీఈవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ చేసిన నిర్వాకంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు నానా ఇబ్బందులు పడుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం: ఖిలా వరంగల్ మండల కేంద్రానికి చెందిన పుప్పాల మధుసూదనాచారి అనే వ్యక్తి వరంగల్ అర్బన్ డీఈవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఖిలావరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ సంగెం మండలం నల్లబల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు . 2011సంవత్సరంలో పుప్పాల మధుసూదనాచారి శ్రీరామ్ ఫైనాన్స్ లో రుణం తీసుకున్నాడు. ఆ సమయంలో శ్రీరాం ఫైనాన్స్లో ష్యూరిటీగా ఖాజామోహినుద్దీన్ పత్రాలను, సంతకాన్ని ఫోర్జరీ చేసి 50,000/- రుణం తీసుకున్నాడు.

తీసుకున్న రుణంలో కొద్ది మొత్తం చెల్లించి ఆపేసాడు, దీంతో ఇంకా చెల్లించాల్సిన రుణం సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో శ్రీరామ్ ఫైనాన్స్ చక్రవడ్డీ,బారు వడ్డీతో సహా 1,50,000/- అయిందని, ఈ మొత్తం కట్టాల్సిందేనని కోరుతూ ష్యూరిటీగా ఉన్నటువంటి ఖాజామోహినుద్దీన్ పేరుతో పాఠశాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సదరు ఉపాధ్యాయుడు ఖంగుతిని, తన పత్రాలను ఫోర్జరీ చేశారని లోన్ తీసుకున్న మధుసూదనాచారిని నిలదీశాడు. దీంతో నీవెవరో నాకు తెలియదంటూ మధుసూదనాచారి ఖాజామొహిద్దీన్ పై మాటల దాడికి దిగాడు. తన ప్రమేయం లేకుండానే తన పత్రాలను ఫోర్జరీ చేసి రుణం తీసుకొని తనను ఇబ్బంది పెడుతున్న మధుసూదనాచారిపై, శ్రీరామ్ ఫైనాన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఖాజామైనొద్దీన్ పోలీసులను కోర్టులను ఆశ్రయిస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చేసీ, తనకు న్యాయం కల్పించమని మీడియాను కోరుతున్నాడు.