{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1583220428368","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1583220393758","source":"other","origin":"unknown"}

వరంగల్ తూర్పు నియోజకవర్గం 15 వ డివిజన్ ఎం.హెచ్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు, కమీషనర్ పమేల సత్పతి, పాల్గొన్న కార్పోరేటర్ శారదా సురేష్ జోషి, అధికారులు, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎం.హెచ్ నగర్, ఎల్బీనగర్ తో పాటు పలు వీదులను మంత్రి, ఎమ్మెల్యే అదికారులతో కలిసి సందర్శించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను వారు స్వీకరించారు. మిషన్ భగీరద నల్లాను ప్రారంభించారు, ఆ నీళ్ళను మంత్రి, ఎమ్మెల్యే కలెక్టర్, కమీషనర్ సేవించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రజలంతా పట్టణ ప్రగతిలో బాగస్వామ్యులవ్వాలని,ప్రతీ ఇంటి లో శుభ్రత పాటించాలన్నారు, ఈ నియోజకవర్గాన్ని అన్నివిదాలుగా మంత్రుల సహాకారంతో అభివృద్ది చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణాను దేశానికే ఆదర్శంగా నిలిపారని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ప్రజలు తమ వీదుల్లో సమస్యలు తెలియజేయాలని, కార్పోరేటర్లు ప్రతీ వీదిలో తిరుగుతూ సమస్యలను గుర్తించాలన్నారు. పెండింగ్ సమస్యలన్నీ పట్టణ ప్రగతితో పరిష్కరించుకుందామన్నారు, చెత్త ఏ రోజుది ఆ రోజే తొలగించాలని, ఇండ్ల ముందు చెత్త వేయకూడదని శుభ్రత పాటిస్తేనే రోగాల బారిన పడకుండా ఉంటామన్నారు. పట్టణ ప్రగతితో వార్డుల అభివృద్ది చేసుకునేందుకు చక్కని అవకాశం అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..

మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ ప్రజా బాగస్వామ్యంతోనే అభివృద్ది సాద్యమని, ప్రజలంతా ఈ కార్యక్రమంలో బాగస్వామ్యులవ్వాలన్నారు. తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారని పేదలకు ఎంతో సేవ చేస్తున్నారన్నారు పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రత్యేక నిదులు కేటాయిస్తుందని పట్టణాలను అభివృద్ది చేసుకుందామన్నారు. మిషన్ భగీరద ద్వారా స్వచ్చమైన త్రాగునీరందుతుందన్నారు…