{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1639897079138","origin":"gallery","is_remix":true,"used_premium_tools":false,"used_sources":"{"sources":[{"type":"ugc","id":"308819914168201"}],"version":1}","premium_sources":[],"fte_sources":["308819914168201"]}
  • తెరాస పుట్టినప్పటి నుంచి తెరాస జండా మోసి, భార్య బిడ్డల్ని కాదు అని ‘పార్టీ’ కోసం అలానే ‘తెలంగాణ’ కోసం పాటుపడి ఉద్యమం చేసిన నాయకులు నేడు కనుమరుగు అయ్యే పరిస్థతి.
  • నామినేటెడ్ పదువుల్లో మొండిచేయి.
  • MLAకు అండగా నిలుస్తున్న కాజీపేట.
  • పదవులు దక్కక నిరాశ చెందుతున్న శ్రేణులు.
  • తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాజిపేటకు ప్రత్యేక చెరిత్ర.

ఉద్యమం చేసే టప్పుడు ఐనా చెప్పుకోవటానికి చేయటానికి ఒక పని ఐన ఉండేది, కానీ వాళ్ల సొంత తెరాస ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్లకు సంతోషం లేకుండా పోయినది, ఇప్పుడు వాళ్ళని చూసి నాదుడే లేడు, ఉద్యమం అప్పుడు అందర్నీ కలుపుకొని పోయిన నాయకులు, ఇప్పుడు పక్కన పెట్టారు.

వరంగల్, కాజీపేట: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాజిపేటకు ప్రత్యేక చెరిత్ర ఉంది. ఐకాస లేదా ఉద్యమ పార్టీ తెరాస నుంచి పిలుపు వచ్చిన వెంటనే స్పందించి ఉద్యమాన్ని నడిపించిన గడ్డ కాజిపేట చౌరస్తా. ఇక్కడా పార్టీలతో పాటు ప్రజలు పాల్గొనడం విశేషం. కాజిపేటలో 100 రోజులు పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చౌరస్తాలో నిరసనలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, దుందం, రైలురోకోలు. వరంగల్ కాళోజి జంక్షన్, అమరవీరుల స్తూపంతో సమానంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. MLA దాస్యం వినయభాస్కర్ కూడా కాజిపేటలో ఎక్కువ ఉద్యమంలో పాల్గొన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఏ ఉద్యమ కార్యచరణ చేపట్టలన్న కాజీపేట నుంచే ప్రారంభించి ఉద్యమానికి ఉపును తీసుకొచ్చేది. కాజీపేటలోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు, ఉద్యమ సమయంలో పోలీసులు పెట్టిన కేసులతో జైలుపాలైన ఘటనలు కూడా ఉన్నాయి. ఉద్యమ సమయంలో కాజీపేటలో ప్రాంతంలో చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా ఉపును తీసుకొచ్చాయని చెప్పవచ్చు. రాజదానిలో జరుగుతున్న కీలకమైన సభలు, సమావేశాల కార్యక్రమాలకు వెళ్లే నాయకులకు, ఉద్యమకారులకు ఇక్కడ నుంచే వీర తిలకం దిద్ది సాగనంపేవారు. తెలంగాణ ఉద్యమంలో కాజీపేటలోని ప్రజలను, కార్మికులను, విద్యార్థులను , ఉద్యోగులను, యువతను భాగస్వామ్యం చేయడంలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కీలకంగా పని చేశారు. దింతో తము పడ్డ కష్టానికి ఫలితం దక్కక పోతుందా అని రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి ఏదురు చూపులు చూస్తున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య మంత్రి కెసిఆర్ ఉద్యమ సమయంలో పని చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తుండటంతో కాజీపేటలోని ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పలు నామినేటెడ్ పదవులు కాజీపేటకు దక్కక పోవడంతో రాష్ట్ర, ఫెడరేషన్, జిల్లా స్థాయిలో చైర్మెన్ మరియు, డైరెక్టర్ పదవులైన అందకపోతాయని ఎదురు చూపులు చూస్తున్నారు. గతంలోను కాజీపేటలోని టిఆర్ఎస్ ముఖ్య నాయకులకు ముఖ్యమైన పదవులు చేజారి పోయాయి. దీంతో నాయకుల్లో కార్యకర్తల్లో, ప్రజల్లో, కాజీపేట పట్ల పాలకులు చిన్న చూపు చూస్తున్నరనే భావన నెలకొంది.

కాజీపేటలోని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ రాష్ట్ర నాయకుడు, MLA దాస్యంకు ముఖ్య అనుచరుడిగా పేరున్న బిసి సామాజిక వర్గానికి చెందిన నార్లగిరి రమేష్ “కూడా చైర్మన్” పదవి వస్తుందని అశీస్తున్నారు, MLAకి కుడా రమేష్ కి పదవి ఇప్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర స్థాయిలో నార్లగిరి రమేష్ పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. అదే విధంగా మైనారిటీ పదవి ఎస్సి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన అయ్యాల దానం, గబ్బేట శ్రీనివాస్ అశీస్తున్నారు. ముస్లిం మైనారిటీ నాయకులు ఎండి సోని, అఫ్టల్ పాషా, ఎండి మహముద్, బిసి సామాజిక వర్గానికి చెందిన సుంచు క్రీష్ణ, శిరుమల్ల దశరథం, పాలడుగుల అనిల్, శివకుమార్, దువ్వ నరేష్(కిట్టు), సురేశ్, తదితరులు డైరెక్టర్ పదవులు అశీస్తున్నారు.

కాజీపేటలో టిఆర్‌ఎస్ కార్యకర్తల సంచలన కార్యక్రమమాలు:

సంఘ్ కార్యాలయంలో ఓ కార్యక్రమానికి వస్తున్నా కాంగ్రెస్ మంత్రిపై తెరాస కార్యకర్తలు అనూహ్యంగా కాపుకాసి దాడి చేసారు. ఈ ఘటనలో 23మందిపై కాజిపేటలో కేసు నమోదు చేసారు, ఉద్యమ నాయకుడు నార్లగిరి రమేష్ ఏర్పాటు చేసిన రావణాసురుని దిష్టిబొమ్మ దహనం కూడా ఇక్కడ సంచలనం రేపింది. 10తలల వివిధ పార్టీల నేతల దిష్టిబొమ్మ పెట్టి దసరా పండుగ రోజు 8/10/2011 దిష్టిబొమ్మను దహనము చేసారు, దీంతో 11 మందిపై కేసు నమోదు చేసారు. రైలు దగ్దం వంటి పలు కార్యక్రమాలు ఎక్కువగా వ్యహత్మకంగా ఆందోళనను జరిగేవి, ఇలా కాజిపేట నుండి అనేక మంది సారధులు ఉద్యమాన్ని ముందుకు నడిపారు.