వరంగల్: దళిత యువతికి న్యాయం చేయాలని, దళిత యువతి శీలానికి వెల కట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, దళితులపై కుల వివక్ష విడనాడాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా ములుగు మండలంలోని బండారుపల్లి గ్రామంలో దళిత సంఘాలు, మహిళా సంఘాలు అధ్వర్యంలో దళిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు అబ్బాయి ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్, దళిత సంఘాల నేతలు దళిత యువతికి అండగా నిలిచి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని అన్నారు.

ములుగు జిల్లా మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన యువకుడు బరుపాటి సూర్యవర్మ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోభర్చుకొని తీరా ఇప్పుడు పెళ్ళి చేసుకోమని అడిగితె పెళ్లి చేసుకోను ఆంటూ నీకూ దిక్కున్న చోట చెప్పుకో అంటూ నువ్వు తక్కువ కులం దానివి అంటూ తనను మోసంచేశారని ములుగు జిల్లా ములుగు మండలంలోని బండారు పల్లికి చెందిన దళిత యువతి గుండేపు మోనిక ఆవేదన వ్యక్తం చేస్తూ ములుగు లోని ప్రేమికుడి ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా దళిత యువతి తనకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తుంటే అగ్రకులాలవారు దళిత యువతిని భయపెడుతు రాత్రిపూట మద్యం సేవించి గుర్తు తెలియని వ్యక్తులు నెంబరు ప్లేటు లేని వాహనాలతో దీక్ష చేస్తున్న శిభిరం చుట్టు ప్రక్కల తిరుగుతూ భయపెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దళిత అమ్మాయికి రక్షణ కోసం దీక్ష చేస్తున్న శిబిరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అమ్మాయికి ఎలాంటి హాని జరిగిన ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.దశల వారిగా పోరాటం మరింత ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ములుగు జిల్లా అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, కోటేశ్వర్ మాల,భద్రయ్య మాల,నర్సయ్య మాల,కుమార స్వామి మాల,టి ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రాములు మాదిగ,కార్యదర్శి ల్యాదల సాంబయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.