వరంగల్: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చనిపోతే వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడటం లేదు. 85 ఏళ్ల వృద్ధురాలు ఎంజీఎంలో మృతి చెందితే ఎవ్వరూ రాలేదు. కాజీపేటకు చెందిన 50 ఏళ్ల వయసున్న ఇద్దరు పురుషులు, 64 ఏళ్ల మహిళ మృతదేహాలు 4 రోజులుగా ఎంజీఎంలోనే ఉన్నాయి. ఫోన్‌ చేస్తే కొందరు ‘మాకు డెత్‌ సర్టిఫికెట్‌ ఇస్తేచాలు. మిగిలిన కార్యక్రమాలన్నీ మీరే చేయండి’ అని, ఇంకొందరేమో ‘దహనం అయిందని ఫోన్‌ చేస్తే స్నానాలు చేసి దీపం ముట్టించుకుంటాం’ అని చెప్పారని ఎంజీఎం సిబ్బంది వెల్లడించారు.