బిజెపి పార్టీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ ర్యాలీ సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లీంపు వుంటుందని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏ.సి.పి మధుసూధన్ ప్రకటించారు. ట్రాఫిక్ మళ్లీంపు కు సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ వివరాలు: బిజెపి పార్టీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ సాయంత్రం 4 గంటలకు ఈ ర్యాలీ కేయూసి నుండి ప్రారంభమయి హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వరకు ముగుస్తుంది. ఈ ర్యాలీ దృష్ట్యా నగరంలో పలు ట్రాఫిక్ మళ్లీంపు ఆంక్షలు సాయంత్రం 03.00 గంటల నుండి 08.00గంటల విధించబడినవి.

  • 1. కరీంనగర్ నుండి హనుమకొండ వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కేయుసి క్రాస్ రోడ్డు నుండి, పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ ములుగు రోడ్డు మీదుగా హనుమకొండ బస్టాండు, వరంగల్ కు చేరుకోవలెను మరియు కరీంనగర్ నుండి కాజీపేట వైపుకు వెళ్లే వాహనాలు కేయుసి క్రాస్ రోడ్డు నుండి సెయింట్ పీటర్స్ స్కూల్, అంబేద్కర్ భవన్, సుబేదారి గుండా కాజీపేటకు వెళ్ళవలెను.
  • 2. వరంగల్ నుండి కాజీపేట వెళ్లే వాహనాలు ములుగు రోడ్డు హన్మకొండ చౌరస్తా, అశోక జంక్షన్, హన్మకొండ బస్టాండ్, కాలోజీ జంక్షన్ ద్వారా కాజీపేట చేరుకోవలెను మరియు కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ములుగు రోడ్డు, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయుసి క్రాస్ రోడ్డు గుండా కరీంనగర్ వైపు వెళ్ళవలెను.
  • 3. కాజీపేట మరియు సుబేదారి నుండి హన్మకొండ, వరంగల్, కరీంనగర్ వచ్చే వాహనాలు కాళోజి జంక్షన్ మీదుగా బాలసముద్రం హన్మకొండ బస్టాండ్ జంక్షన్, అశోక జంక్షన్, ములుగు రోడ్డు మీదుగా వరంగల్ కు వెళ్ళవలెను మరియు పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయుసి క్రాస్ రోడ్డు నుండి కరీంనగర్ వెళ్ళవలెను.

సమస్త ప్రయాణికులకు తెలియ జేయునది ఏమనగా ఇట్టిది ప్రజల సేవార్దమై ఇచ్చినదిగా భావించి పైన తెలిపిన సరియగు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి పోలీసులకు సహకరించ గలరని మనవి. ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయము…