{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_sticker"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":1,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"total_editor_time":62,"brushes_used":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581407978567","total_effects_time":0,"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581408052149","sources":["306566523051201"],"layers_used":0,"width":4096,"height":2048,"subsource":"done_button"}

స్మార్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న రేట్‌ యువర్‌ సిటీ అంశానికి సంబంధించి సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ ద్వారా నగరానికి ఉత్తమ రేటింగ్‌ ఇవ్వాలని నగర వాసులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి కోరారు. వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో శానిటరీ జవాన్లకు రేట్‌ యువర్‌ సిటీపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ఆరంభానికి ముందుగా ఇటీవల మేడారంలో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు వాసాల రంజిత్‌ పట్ల విచారం వ్యక్తం చేశారు.

రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. జవాన్లకు అవగాహన కల్పనతో పాటు జవాన్లు రేటింగ్‌ ఇచ్చారు. నగర వాసులకు రేట్‌ యువర్‌ సిటీ ప్రాముఖ్యతను తెలియచేయాలని వారికి కమిషనర్‌ సూచించారు. అంతే కాకుండా ఒక్కో జవాన్‌ వేయి మందితో రేట్‌ యువర్‌ సిటీపై ఫీడ్‌బ్యాక్‌ ఇప్పించే బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. నగరంలో చెత్తా ఎక్కడపడితే అక్కడ వేయకుండా జనాలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా యాప్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్త విభజన పకడ్బందీగా జరగాలన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల వలే స్మార్ట్‌సిటీలోని రేట్‌ యువర్‌ సిటీకి కూడా మెరుగైన రేటింగ్‌ వచ్చేలా జనాలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ప్రసుతం 44వ ర్యాంక్‌లో ఉన్న నగరాన్ని టాప్‌ టెన్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ మేరకు కృషి చేయాలన్నారు. ఇటీవల వైజాగ్‌లో జరిగిన స్మార్ట్‌సిటీ సదస్సులో తన పరిశీలనలోకి వచ్చిన కొన్ని అంశాలు ఆకట్టుకున్నాయన్నారు. వైజాగ్‌లో శానిటేషన్‌ సేవలు మెరుగ్గా ఉన్నాయని కార్మికులు, సిబ్బంది పనిలో చూపే శ్రద్ధ అభినందనీయమన్నారు. అదే విధంగా ఇంజినీరింగ్‌ విభాగం అధికారుల పని తీరు కూడా ప్రశంనీయంగా ఉందన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వంద శాతం వసూలు కావాలని ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డిని ఆదేశించారు.