నర్సంపేట పట్టణం లో ఈ మధ్య పలు వ్యాపారాల్లో పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న మార్వాడీ దుకాణాలు అంతే వేగంగా రాత్రికి రాత్రే తట్టా,బుట్టా సర్దుకొని జంప్ అవుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఓ ఎలక్ట్రికల్ దుకాణ దారుడు చేతులెత్తేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు, అతనికి లక్షల రూపాయల సామాను క్రెడిట్ పద్దతిలో ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, వివిధ కంపెనీల స్టాకిస్ట్ లు ఇప్పుడు లబో దిబోమం టున్నారు. తాజాగా నర్సంపేట మెయిన్ రోడ్డు లో ఓ స్టీల్ సామానులు అమ్మే మార్వాడీ దుకాణ దారుడు నిన్న రాత్రి తన సామాను అంతా ఓ వాహనం లో సర్దుకొని పరారయ్యాడు.

ఇలా పుట్ట గొడుగుల్లా మార్వాడీ దుకాణాలు వెలుస్తూ ఒరిజినల్ వస్తువులకు డూప్లికేట్ లు తీసుకొచ్చి అమ్మడం లో దిట్ట అయిన వీరు. నకిలీ వస్తువులను తక్కువ ధరలకు అమ్మడం తో కస్టమర్లకు నష్టం జరుగడమే కాక స్థానిక మార్కెట్ ని చెడగొడుతూ రాత్రి రాత్రే జంప్ అవుతున్నారు. కానీ వ్యాపారాన్నే నమ్ముకుని భారమైనా కూడా అధిక కిరాయిలు కడుతూ ఇబ్బందులు పడుతూ వ్యాపారాన్ని నడిపిస్తున్న స్థానిక చిన్న చిన్న వ్యాపారస్తులకు తీరని నష్టం జరుగుతున్నది.