సినీ నటుడు నాగబాబుపై మండలంలోని బంజరుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ వాది ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాడ్సేను సమర్ధిస్తూ, ప్రాణాలను త్యాగం చేసిన గాంధీజీనీ, గాంధేయ వాదాన్ని వక్రీకరిస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నాగబాబు పోస్టులు ఉన్నాయని, చట్టపరంగా చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.