రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో గంట సునీల్( 20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గంట రఘు తనకు ఉన్న 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకంటూ జీవనం సాగిస్తున్నారు. పంట పండక అప్పులు కావడంతో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకుని 6 లక్షల రూపాయలు మంజూరు చేసింది. కానీ ఆ డబ్బులు ఇప్పటికి చేతికి అందక తన చిన్న కొడుకు తీవ్ర మనస్తాపానికి గురై సంవత్సరం తిరగక ముందే తన తండ్రి లాగే ఉరివేసుకోని చనిపోవడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి బాధ చూడలేక ఊరు ఊరంతా కన్నీరు మున్నీరు అయ్యారు. ఎలాగయినా ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు..