మడికొండ: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కాజీపేట ప్రాంతానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత నార్లగిరి రమేష్ కు వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ (కుడా) చైర్మన్ పదవి ఇవ్వాలని రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లగురుగుల దళపతి కోరారు. శనివారం కాజీపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు: ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నార్లగిరి రమేష్ కు కుడా చైర్మన్ పదవి అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయమై 14న చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారిని కలుస్తామని కమిటీ సభ్యులతో తీర్మానం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో నార్లగిరి చురుగ్గా పాల్గొన్నారన్నారు. తెలంగాణ సర్కార్ రజకుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, అయినా ఉద్యమ ఆసాంతం పనిచేసిన రమేష్ కు కుడా చైర్మన్ పదవి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల సుదర్శన్, యువసేన వైస్ చైర్మన్ సుకుమార్, ట్రై సిటీ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా యువసేన అధ్యక్షుడు రమేష్, వీరనారి ఐలమ్మ కో – ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రాజలింగం, నాయకులు రఘుపతి, రాములు, రమేష్, కుమార్, రాజలింగం, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.