{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1598273088710","source":"share_action_sheet","origin":"gallery","sources":["290279836040211","326606682052211"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1598986932755"}

నాలలపై అక్రమ కట్టడాల తొలగింపులో వేగాన్ని పెంచాలని భాగంగా మంగళవారం నాడు మహా నగర పాలక సంస్థ కమీషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ: నేడు నాలలపై 3 ఆక్రమణలను తొలగించినట్లు అందులో నయింనగర్ నాలపై 100 ఫీట్ల నాలా మార్కింగ్ చేస్తూ 2 అక్రమ నిర్మాణాలను, భద్రకాళి నాలపై ఒక అక్రమ నిర్మాణాన్ని
తొలగించినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు పలు నాలలపై మొత్తం 49 ఆక్రమణలను తొలగించడం జరిగింది.

అదే విధంగా, శిథిలావస్థలో ఉన్న గృహాలను నేడు 8 మొత్తం 307 గృహాలను తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిపిలు ప్రకాష్ రెడ్డి, గణపతి, టిపిబిఓ లు కావ్య, సుమన, ఖాజా షరీఫ్, బషీర్ వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు ఉన్నారు.