వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు (శుక్రవారం) అంబేడ్కర్ భవన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.

  • వరంగల్ ని అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతాం
  • వరంగల్ ని చరిత్రలో నిలిచే స్థాయిలో అభివృధ్ధి చేస్తున్నాం
  • అభివృద్ధికి వస్తున్న అడ్డంకులను తొలగిస్తున్నాం
  • కరోనా మహమ్మారి వల్ల అభివృద్ధిలో వెనకబడ్డాం – మరింత వేగంగా అభివృద్ధి ని చేద్దాం
  • సీఎం కేసీఅర్ కరోనా సమయంలో రాష్ట్రంలో తీసుకున్న చర్యలు అధ్బుతంగా పని చేశాయి
  • ఎంజిఎంకి మరిన్ని నిధులు కేటాయించి ప్రజలని కాపాడుకుందాం
  • సెంట్రల్ జైలు స్థలాన్ని ఎంజీఎం కు కేటాయించి దవాఖనను మరింత అభివృద్ది చేద్దాం

వరంగల్ అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేశాం:

  • మాస్టర్ ప్లాన్ లో వర్షాలకు నిండే నాలల గురించి చేర్చలేదు మంత్రి కెటీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
  • కరోనా మహమ్మారి, వర్షాల కారణంగా అభివృద్ది ప్రణాళికలు ఆలస్యమయ్యయి
  • ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ కి ఈ మధ్య ఉత్పన్నమైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా సరికొత్తగా మాస్టర్ ప్లాన్ ని తయారు చేస్తాం
  • గ్రేటర్ వరంగల్ నాలాల ఆక్రమణ తొలగింపు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వుంది
  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తన ఇంటిని తానే స్వయంగా కుల్చుకున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను.
  • కార్పొరేటర్ దామోదర్ ఇంటి కూల్చివేత పై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని అదేశిస్తున్నాను
  • కార్పొరేటర్లు అందరూ కూడా నాలాల కూల్చివేతకు సహకరించండి
  • నాలాల సమస్యలకు త్వరగానే పరిష్కారం చూపుతాం
  • మంత్రి కెటీఆర్ గారితో కార్పొరేటర్లకు మీటింగ్ పెట్టి ఆయా డివిజన్లలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తాం
  • మీ అందరి సహకారంతో వరంగల్ ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదాం
  • ఈ సమావేశంలో మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.