వరంగల్‌లో 15 నో మూమెంట్ జోన్లలో హైఅలెర్ట్ కొనసాగుతోంది. మొబైల్ మార్కెట్ల ద్వారా నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరు మినహా మిగిలిన వారంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారేనని అధికారులు గుర్తించారు. ఆ ఏరియా నుంచి బయటకు, బయట నుంచి లోపలికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.