జిల్లాలోని హంటర్ రోడ్ న్యూ శాయంపేటలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.3 లక్షలుగా తెలుస్తోంది.

వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్ న్యూ శాయంపేట లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో రెండు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. ఈ గడ్డి వాములు 32వ డివిజన్ కార్పొరేటర్ అరుణ శివశంకర్ చెందినవి. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. రెండు ఫైర్ ఇంజన్స్ వచ్చిన మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది.సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.