వరంగల్: త్రినగరిలోని పార్కుల అభివృద్ధి పనులను త్వరితగతిన పుర్తి చేయాలని బల్దియా కమీషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ఆధ్వర్యంలో రెవెన్యూ కాలనీ లోని ప్రగతినగర్లో నిర్మిస్తున్న అమృత్ పార్క్ సివిల్ వర్క్ పనులను ఆమె పరిశీలించారు. సివిల్ వర్క్ పూర్తయినందున వెంటనే సుందరీకరణ పనులను చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ వెంట డిఈ సంతోష్ బాబు, రవీందర్, ఏఈ కృష్ణమూర్తి, హరికుమార్ ఉన్నారు.