పెళ్ళైన నాలుగు నెలలు గడవక ముందే నరకం చూపించి అతి కిరాతకంగా భార్యను చీరతో గొంతు బిగించి హత్య చేసిన భర్త, మామను సోమవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ ప్రకాష్ రెడ్డి పేట లోని లోటస్ కాలనీ లో జరుపుల నాగరాజు కు ఈ సంవత్సరం మర్చి 22 వ తేదిన కామారెడ్డి జిల్లాకు చెందినా సంగీత లలిత అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో సంగీత తల్లిదండ్రులు 5 లక్షల నగదు ఇతర కట్న కానుకలు, పెట్టుబోతలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించినారు. కాని నాగరాజు మరియు అతని తల్లిదండ్రులు సంగీతను ఇంకా అదనపు కట్నం తెమ్మని వేదింపులకు గురిచేయడం మొదలు పెట్టినారు.

ఈ క్రమంలో, ఈరోజు మధ్యరాత్రి బార్య భర్తల ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఆ గోడువలో నాగరాజు సంగీతను కొట్టి చీరతో గొంతుకు బిగించి చేంపివేసినాడు. తర్వాత చీరకు ఒక వైపు మెడకు కట్టి సీలింగ్ హుక్ కు వేల్లదదీసి సంగీత ఉరి వేసికున్నట్లుగా చిత్రికరించినాడు. ఈ క్రమంలో నాగరాజు మరియు అతని తండ్రి బాలు ఇద్దరు పరారిలో ఉండి నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు బట్టలు తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఇంటికి వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం చేరడంతో సుబేదారి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించినారు.