కాజీపేట 51 వ డివిజన్ చైతన్యపురి కాలనీ సమీపంలో నివసించే నారాయణకు మీ పేటీఎం కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని, అందుకు క్విక్ సపోర్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు ఓ ఆగంతకుడు. నిజమే అని నమ్మిన నారాయణ వెంటనే క్విక్ సపోర్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకుండా అతను చెప్పినట్లుగా నడుచుకున్నాడు. మొదట మీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయని ఆగంత కుడు అడిగాడు. రెండు కార్డులున్నాయని చెప్పారు. ఒక కార్డుతో ఒక రూపాయి ఎవరికైనా పంపించాలని సూచించాడు. నేరగాడు చెప్పినట్లుగా నారాయణ చేశారు. ఇది పని చేయడం లేదనుకుంటా, మరో కార్డుతో చేయండని సూచించాడు ఆ సైబర్ నేరగాడు. అతడు చెప్పినట్లుగా రెండో కార్డును ఉపయోగించ గానే రూ.35 వేలు బ్యాంక్ నుంచి డ్రా అయినట్లు మెజేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించి లబోదిబోమనుకుంటూ పోలీసులను ఆశ్రయించాడు…