వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లతో పాటు ఇతర విభాగాల్లో విధులు నిర్వహించే పోలీసులకు వారాంతపు సెలవును ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు అదేశించారు. వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ అధ్వర్యంలో పోలీస్‌ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని శుక్రవారం పోలీస్‌ కమీషనరేట్‌ కార్యాలయములో నిర్వహించారు.

ఈ సమావేశంలో ముందుగా గణేష్‌ నవరాత్రులతో పాటు నిమర్జన కార్యక్రమాన్ని సజావు నిర్వహించినందుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసుఅధికారులు సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలిపారు. డి.సి.పి, ఎ.సి.పి, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ స్టేషన్ల వారిగా పోలీస్‌ అధికారుల పనీతీరుతో పాటు కేసుల నమోదు వాటి పరిష్కరణ, నిందితుల అరెస్టులు మరియు కేసుల ప్రస్తుత స్థితిగతులపై అన్‌లైన్‌ విధానంతో పోలీస్‌ కమీషనర్‌ సంబంధిత పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు.