పట్టణంలోని మూడో వార్డులో గురువారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ చెట్టు కింద వాహనం ఆపి బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. పక్కనున్న చెట్టు పూర్తిగా ఎండిపోయి ప్రమాదకరంగా ఉంది. అలాగే పట్టణంలో జరుగుతున్న ప్రచారంలో టాటా ఏస్‌ ఆటోలో పరిమితికి మించి కార్యకర్తలు, పార్టీల సానుభూతిపరులు ప్రయాణించారు. ఎన్నికల ప్రచార సభల్లో నేతలు, కార్యకర్తలు, నాయకులు పలు జాగ్రత్తలు తీసుకుని ప్రచారం చేస్తే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానించారు.