ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం కోసం కార్డన్‌ సర్చ్‌ నిర్వహించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డా.వి.రవీందర్‌ తెలిపారు. శాంతి భద్రతల నియంత్రణలో భాగంగా హన్మకొండ డివిజన్‌ అధ్వర్యంలో సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దీన్దయాల్‌ నగర్ కాలనీ ప్రాంతంలో కార్డన్‌ సర్చ్‌ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్‌ సర్చ్‌లో భాగంగా లక్ష్మీపురం కాలనీ ప్రాంతంలోని సుమారు 200పైగా పోలీసు అధికారుల, సిబ్బంది అనుమానిత ఇండ్ల తనీఖీలు నిర్వహించారు.

ఈ ప్రాంతంలో నివసించే రౌడీ షీటర్లు గతంలో నేరాలకు పాల్పడిన నేరస్థుల ఇండ్లను పోలీసులు తనీఖీ నిర్వహించి వారి ప్రస్తుత జీవన విధానంపై పోలీసులు ఆరా తీయడం జరిగింది. ఈ కార్డన్‌ సర్చ్‌లో భాగంగా ఎలాంటి పత్రాలు లేని 18 వాహనాలను పోలీసులు సీజ్‌ చేయడంతో పాటు అనుమానితులను విచారించడం జరిగింది. అనంతరం పోలీస్‌ కమీషనర్‌ ఈ ప్రాంత ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్బంగా పోలీసుల పనీతీరుపై కమీషనర్‌ స్థానిక ప్రజలను అడిగితేలుసుకోవడంతో పాటు, శాంతి భద్రతలకు సంబంధించి స్థానిక సమస్యలను పోలీస్‌ కమిషనర్‌ ఆరా తీసారు.

అనంతరం పోలీస్‌ కమీషనర్‌ మట్లాడుతూ నేరాల నియంత్రించడంతోపాటు, నేరస్థులను గుర్తించడం కోసం ఈ కార్డన్‌ సర్చ్‌ నిర్వహించడం జరుగుతుందని. ముఖ్యంగా ప్రజల భద్రత కోసం కాలనీలో ముమ్మరం పెట్రోలింగ్‌ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా బ్లూకోల్స్ట్‌ విభాగం చేయడం ద్వారా 24 గంటలు మీ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించబడుతుందని, గతంలో నేరాలకు పాల్పడిన నేరస్థులపై నిఘా కోనసాగించడం జరుగుతుందని, ముఖ్యంగా నేరాల నియంత్రణకు ప్రజలు స్వచ్చందగా సి.సి కెమెరా ఏర్పాటు ముందురావల్సిన అవసరం వుందని, తద్వారా నేరాలను తగ్గించడంతో పాటు,

నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సులభతరం అవుతుందని, ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో వున్న అధునిక పరిజ్ఞానంను వినియోగించుకోని నేరస్థులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డి.సి.పి నరసింహ, హన్మకోండ ఎ.సి.పి కిషన్, ఇన్స్‌స్పెక్టర్లు సదయ్య, డేవిడ్ రాజుతోపాటు ఎస్‌.ఐ. మహేందర్ ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.