
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికా ఎలాన్ మాస్క్ యొక్క సింతసిస్ స్కూల్లో సీటు సాధించిన గోపాలపూర్ కు చెందిన అనిల్ పౌల్.
- దేశంలోనే మొదటిసారిగా అమెరికా ఎలన్ మాస్క్ సింతసిస్ స్కూల్లో సిటు సాధించిన విదర్థిని అభినందించిన ఎమ్మెల్యే అరూరి.
- అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా 40వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేత.
గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్ కు చెందిన అనిల్ పౌల్ అత్యంత ప్రతిభా పాటవలతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాలోని ఎలన్ మాస్క్ యొక్క సింతసిస్ స్కూల్లో సిటు సాధించడం గొప్ప విషయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.
దేశంలోనే మొదటిసారిగా ఎలన్ మాస్క్ సింతసిస్ స్కూల్లో సిటు సాధించిన విద్యార్ధి అనిల్ పౌల్ ను ఎమ్మెల్యే గారు అభినందించారు. ఈ సందర్బంగా విద్యార్థికి అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా 40వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్ లో ఉన్నత చదువులు అభ్యసించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్ధికి సూచించారు. ఈ కార్యక్రమంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ గారు, స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్, పోలేపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం:
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామానికి చెందిన అరూరి సాహిత్య ఫార్మాసి విద్యార్థినికి కళాశాల ఫీజు నిమిత్తం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా 50 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
బక్సింగ్ క్రీడాకారునికి చేయూత:
గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పలివెల్పుల గ్రామానికి చెందిన దేవరకొండ వినయ్ పంజాబ్ రాష్ట్రంలోని ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో అతని ప్రయాణ, మరియు ఇతర ఖర్చుల నిమిత్తం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా 10వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్, వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్ గారు అందజేశారు.