వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 14 లక్షలు విలువ చేసే లాపరోస్కోపిక్ యంత్రం మాయమయింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి, ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఆసుపత్రి అధికారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో మిషిన్ మాయమవడం వెనుక ఎవరున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు.