వరంగల్ లోని కే.ఎం.సీ ఆడిటోరియంలో తెలంగాణా ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆద్వర్యంలో మన ఊరు – మనబడి/ మన బస్తీ – మన బడి అవగాహనా కార్యక్రమం జరిగింది..ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ: సర్కారు బడులలో కార్పోరేట్ స్థాయి విద్యను అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రణాళికలు రూపొందించారన్నారు మన ఊరు మనబడి ఒక గొప్ప కార్యక్రమమన్నారు, పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని రూపొందించారు సర్కారు బడుల్లో పూర్తి స్థాయిలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టనున్నారు.

బడుల్లో మౌళిక వసతుల కల్పన,పాఠశాలల అభివృద్దికి శ్రీకారం చుట్టారు పాఠశాలల కమిటీలలో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు చేపట్టాలని, నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు పేద ప్రజలకు అందేలా చూసేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలి, మన బడులను బాగుచేసుకునే సదావకాశం ఇది, బడులలో చదువుకున్న పూర్వ విద్యార్ధులకు పాఠశాల అభివృద్దిలో బాగస్వామ్యం చేయడం ద్వారా వారు చదువుకున్న బడికి సేవ చేసే అవకాశం లబిస్తుందని, విద్య నేర్పిన దేవాలయాలు బడులు వాటిని బాగుచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలను అద్బుతంగా అభివృద్ది చేసుకుందామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు, విద్యాశాఖ అదికారులు, ఉపాద్యాయులు, నాయకులు పాల్గొన్నారు..