వరంగల్ జిల్లా, పర్వతగిరి(సంగెం), వెలుగు: ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ బాలిక ఆత్మహత్యచేసుకుంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహితలో జరిగింది. స్థానిక ఎస్సై సురేశ్ తెలిపిన వివరాలప్రకారం:

లోహిత గ్రామంలోని ఓ బాలిక(17)ను అదే గ్రామానికే చెందిన చెరకు జగదీశ్ ప్రేమ పేరుతో వెంటపడేవాడు. ఈ క్రమంలో బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో జగదీశ్ ను, అతడి తల్లిదండ్రులను పెద్దమనుషుల వద్దకుపిలిపించి మందలించారు. కొద్ది రోజులతర్వాత జగదీశ్ మళ్లీ బాలిక వెంటపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులుముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.