ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కుమ్మరి కావ్య అనే యువతి ఆత్మహత్య చేసుకొంది. కమలాపూర్‌ మండలం మాదన్న పేటకు చెందిన కావ్య హన్మకొండలోని భీమారంలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సదయ్య అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని కొంతకాలంగా వెంటపడుతున్నాడు.

ఆగస్టు 29న కళాశాలకు వెళ్తున్న కావ్యను అడ్డగించిన సదయ్య, తనను ప్రేమించాలని రోడ్డుపైనే ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన కావ్య అదే రోజు పురుగుల మందు తాగింది. ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది.