వరంగల్ రూరల్: ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై తన ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన జిల్లాలోని పరకాల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకి విళ్తే: పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చిలువేరు ప్రవీణ్ ఫైనాన్సర్ల వేధింపులతో ఆటోకు నిప్పంటించాడు. ఇందుకు హన్మకొండలోని హంటర్ రోడ్డుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నిర్వహకుల వేధింపులే కారణమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.