వరంగల్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలుగు వెలిగిన కొండా దంపతులు ఇప్పుడు రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. వైఎస్ఆర్ టైం నుంచి ఇప్పటిదాకా దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రులుగా చేసి జగన్ కోసం రాజీనామా చేశారు. వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ ఏపీలో కూడా అభిమానం చూరగొన్న ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ ఈ మధ్య యాక్టివ్ గా లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కొండా సురేఖ దంపతులు ఆ ఎన్నికల్లో ఓటమితో ఇన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా మళ్లీ జూలు విదిల్చారు. రాబోయే వరంగల్ మేయర్ ఎన్నికల్లో వాళ్ల సత్తా చాటాలని కార్యకర్తలతో తాజాగా సమావేశం పెట్టుకున్నారట. ఎలాగైనా వరంగల్ లో వాళ్ల సత్తా చాటాలని టీఆర్ఎస్ గడ్డలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కొండా సురేఖ పంతం పట్టారట..

ఈ క్రమంలోనే హైకమాండ్ తో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఒక్కసారిగా కొండా దంపతులు యాక్టివ్ అవ్వడంతో ఆటోమేటిక్ గా వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడక్కడ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిందట.. చూద్దాం కొండా దంపతులు ఈ మున్సిపల్ ఎన్నికల్లోనైనా సక్సెస్ అవుతారో అని వాళ్ల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారట..