మనకు టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్లను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అలా మనకున్న అచ్చ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. మొదట్లో మంచి ఆఫర్లే వచ్చాయి కానీ ఈమధ్య మాత్రం కెరీర్ స్లో అయింది. ‘అరవింద సమేత’తో కెరీర్ భారీ టర్న్ తీసుకుంటుందని ఆశించింది కానీ సెకండ్ హీరోయిన్ కావడం, పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అలా ఏమీ జరగలేదు. అయితే ఈషా అధైర్యపడకుండా కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజనులతో టచ్ లో ఉంటోంది. ఈషా తాజాగా ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ “బ్లూ” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో బ్లూ టీ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టైలిష్ పోజులిచ్చింది.

ప్యాంట్ కే కిచెన్ లో వాడే ఏప్రాన్ టైపులో ఒక టాప్ కూడా ఉండడంతో ఈషా చాలా స్టైలిష్ గా ఉంది. యాక్సెసరీస్ లేకుండా.. మినిమమ్ మేకప్ తో లూజ్ హెయిర్ తో ఎంతో న్యాచురల్ గా కనిపిస్తోంది. తెలుగు భామ అనగానే లంగా ఓణీ డ్రెస్సులే అనుకుంటాం కానీ ఈషా మాత్రం మోడరన్ డ్రెస్సులలో కూడా తనకు సాటిలేదని నిరూపించింది. ఈ ఫోటోలకు నెటిజనులు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “ఫిదా హోగయా” “నువ్వు కేక డార్లింగ్” “వరంగల్ భామ వెరీ బ్యూటిఫుల్” అంటూ పొగడడం లో బిజీ అయ్యారు. దాదాపుగా లక్ష లైకులు కొట్టారు. అంతా బాగానే ఉంది కానీ మన ఫిలిం మేకర్లు ఈ ఫోటోలను చూస్తున్నారో లేదో. ఉత్త మాటలు మనం లక్ష చెప్తాం. పైసా ఖర్చు కాకుండా కామెంట్లు పెడతాం. వీటితో ఈషాకు ఉపయోగం ఏముంటుంది? ఆఫర్లు కదా ముఖ్యం అవి ఫిలిం మేకర్లే ఇవ్వాలి.