వరంగల్ అర్బన్: రామన్నపేట గౌడ బార్ లో దారుణ హత్య మద్యం మత్తులో ఘర్షణ, బీర్ సీసాతో పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందిన అల్లావుద్దీన్..

వరంగల్ లో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గౌడ రెస్టారెంట్ & బార్ లో అల్లా ఉద్దీన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బీరు సీసాతో పొడిచి పరారయ్యారు. స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు అల్లావుద్దీన్ బార్ కి వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులతో గొడవ జరిగింది. దీంతో వారు ఖాళీ బీరుసీసాతో అల్లావుద్దీన్ ను విచక్షణారహితంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….