అభ్యుదయ సేవ సమితి మరియు చైల్డ్ లైన్ 1098 అర్బన్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో నేడు సుబేదారి లోని బాలికల సదనం లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీ-హబ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శాంత తౌటం మాట్లాడుతూ: దేశంలో విద్యా హక్కు చట్టం 2009 సంవత్సరంలో వచ్చిన నాటి నుండి 14 సంవత్సరాలలోపు బాల బాలికలు ఎవరు కూడా బాల కార్మికులుగా మారకుండా నిర్బంధ విద్యను కొనసాగించాలని తెలిపారు. ముఖ్యంగా భారత ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి విద్యాభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయించాలని వారి భవిష్యత్తును బంగారు బాట వేయాలని అన్నారు. సమాజంలోని అన్ని రకాల ప్రజలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో టోల్ ఫ్రీ నెంబర్ 1098 ఉపయోగించుకోవాలని ఇక్బాల్ పాషా తెలిపారు.