ఉమ్మడి వరంగల్ జిల్లా లో కొండా సురేఖ కుటుంబానికి మంచి బలం ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొండా సురేఖ మాత్రం గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. కొండా సురేఖ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా వరకు సీరియస్ గా ఉంది. తమను జిల్లాలో ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న కొండా సురేఖను ఎలా అయినాసరే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి అని టిఆర్ఎస్ పట్టుదల గానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొండా సురేఖకు ఆశించిన స్థాయిలో మద్దతు రావడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది.

ఆమెకు బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు బీజేపీ గాలం వేస్తుంది ఆమె వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. బీజేపీ లోకి వెళ్ళడానికి ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. త్వరలోనే కొండా సురేఖ బిజెపిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దసరా తర్వాత ఆమె బిజెపిలో కి వెళ్ళ వచ్చు అని జిల్లా పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు.

జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు తీరుతో కూడా కొండా సురేఖ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆమె ఎప్పుడు మారుతారు ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయినా సరే అందుకు తగిన విధంగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు కనపడలేదు. 2018 లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కొండా సురేఖ చాలావరకు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.