బిజెపి అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అమరేందర్ రెడ్డి గారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రావు పద్మ గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం జ్వరంతో పాటు ఆయాసం రావడంతో అనుమానంతో దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.రావు పద్మ చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు.