భారతీయ జనతాపార్టీలోకి ఓ అధికార పార్టీ కార్పొరేటర్ చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేకు కుడిభుజంలా వ్యవహరించే ఆ కార్పొరేటర్ పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుం టున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపి, భారీ సంఖ్యలో తమ అనుచ రులతో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత అయిన ఈ కార్పొరేటర్ పార్టీ ఆవిర్భావ సమయంలో జడ్పీటీసీగా సైతం గెలిచాడు.

కాగా, టీఆర్ఎస్ పార్టీలో అనేక ఏళ్లుగా ఉన్నా తనకు ఏమాత్రం గుర్తింపు లేదని, అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తమ అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. రెండు రోజులుగా తనకు పరిచయం ఉన్న అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. కార్పొరేటర్ తోపాటు ఆయన అనుచ రులు భారీ సంఖ్యలో బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది…