{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1629168872983","source":"other","origin":"gallery"}

మహబూబాబాద్‌ రూరల్‌: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సంతరించుకున్న ‘బుల్లెట్టు బండెక్కి’ పాటకు అందరూ ఆకర్షితులవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది జంతువులకూ పాకింది. మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ(కోతి) మొబైల్‌ ఫోన్‌లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది.

ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్‌ ఫోన్‌లో పాటను చూస్తూ ఆ కొండెంగ పాలు తాగడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.