శుక్రవారం నుండి శ్రీ భద్రకాళీ దేవస్థానం, వరంగల్ నందు ఉచిత పార్కింగ్ మరియు ఉచిత పాదరక్షలు (చెప్పులు) విప్పట నిర్ణయించనైనది. ఎవరయినా పార్కింగ్ రుసుము అడిగినా చెప్పుల స్టాండ్ లో డబ్బులు అడిగినా భక్తులు ఎవరూ ఇవ్వకూడదని కమీషనర్ తెలిపారు.
కోవిడ్ -19 మరలా తిరిగి తీవ్రరూపం దాల్చి కోరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించవలయును. భక్తులు వ్యక్తిగత దూరం తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించవలయును. మాస్క్ లేనిచో దేవస్థానములోకి ప్రవేశం లేదు. ప్రవేశ ద్వారం వద్ద చేతులు శానిటైజ్ చేసుకొని ఎటువంటి వస్తువులు తాకకుండా వెళ్ళవలయును.

అంతే కాకుండా దేవస్థాన ప్రాంగణంలో పూజాసామాగ్రి అధిక ధరలకు విక్రయించున్నారన్న విషయంలో వారికి నోటీసులు జారీచేయడం జరిగినది. ప్రస్తుతం వారి టెండరు కాలము ముగియనందున శ్రీయుత కమీషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారితో చర్చించి పూజా సామాగ్రి విక్రయించు విషయంలో భక్తులకు అనుకూలముగా తగు నిర్ణయము తీసుకొనబడును అని శ్రీ.భద్రకాళీ దేవస్థానం కమీషనర్ తెలిపారు…