ములుగు తాడ్వాయి మండలంలో భర్త కాపురానికి తీసుకెల్లడం లేదని, పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన మండలంలోని అన్నారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సెకండ్ SI ఎండి, అబ్దుల్ ఘనీ తెలిపిన వివరాల ప్రకారం: గంగారం గ్రామ పంచాయితీ పరిధిలో గల అన్నారం గ్రామంలో నివాసం ఉంటున్న మడకం ఇడిమి (సునీత24) ను గత నాలుగు సంవత్సరాల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రoలోని సుకుమా జిల్లాకుంట గ్రామానికి చెందిన భద్రయ్యతో వివాహం జరిగింది.

భద్రయ్య మద్యానికి బానిస అయి రెండు సంవత్సరాల నుండి కాపురానికి తీసుకెళ్లడం లేదు. దీంతో తల్లి తండ్రుల వద్దే ఉంటూ కూలి పనులు చేసుకుంటుంది. భర్త కాపురానికి తీసుకెల్లడం లేదనే మనోవేదనకు గురై పురుగుల మందు సేవించింది.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతు గురువారం మృతి చెందింది. తండ్రి మడకం రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.