జనగామ: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భాజపా నేతలపై దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పామ్నూర్‌లో సంజయ్‌ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాన్ని భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.