వరంగల్‌ రూరల్ జిల్లా నర్సంపేటలో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన భార్యాభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తులతో పొడవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకన్నకు తీవ్ర రక్తశ్రావమైంది. వెంటనే ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ICUలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. నర్సంపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అంబటి వెంకన్న రోజులాగే ఉదయాన్నే భార్యతో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. పథకం ప్రకారం ఆయనపై ఎటాక్ చేశారు ప్రత్యర్థులు. భూ వివాదమే ఈ దాడికి కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.