మహబూబాబాద్‌ జిల్లా గార్ల పంచాయతీ పరిధి గండి గ్రామానికి చెందిన అత్తులూరి భాస్కర్‌ (36)భార్య విడాకులు ఇచ్చిందని జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం: అత్తులూరి భాస్కర్‌ గార్లలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం అమలేశ్వరితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆరేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. గత జనవరిలో భార్య విడాకులు ఇచ్చింది.

భార్య లేదనే మనస్తాపంతో భాస్కర్‌ మ ద్యానికి బానిసయ్యాడు. జీవి తంపై విరక్తి చెందిన భాస్కర్‌ ఈ నెల 5న ఇంట్లో తల్లితండ్రులకు గార్ల వెళ్లొస్తానని చె ప్పి, ఇంటికి 100 మీటర్ల దూ రంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా భాస్కర్‌ బావిలో శవమై కనిపించగా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతుడి అన్న శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై బానోత్‌ వెంకన్న తెలిపారు.