మొసలిని చూసి స్థానికులు, రైతులు భయోందోళనకు గురయ్యారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలో ఓ భారీ మొసలి హల్‌చల్ చేసింది. వ్యవసాయపనులకు వెళుతున్న రైతులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు.

వివరాలు: మహాదేవపూర్ మండలం పల్గుల అటవీ ప్రాంతంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. మొసలి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అతి కష్టం మీద మొసలిని బంధించి శివ్వారం మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఇటీవలి వర్షాలకు అన్నారం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో మొసలి కొట్టుకువచ్చినట్టు భావిస్తున్నారు. భారీగా ఉన్న మొసలిని చూసి స్థానికులు, రైతులు భయోందోళనకు గురయ్యారు.