మహబూబాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ A. నరేష్ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ మృతి. 2007 సంవత్సరం నుండి ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న ఆవుల నరేష్ అనే డ్రైవర్ ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య పూలమ్మ, 2 కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ లు కలరు. ఒకవైపు భార్య గత 5 సంవత్సరాలుగా హృద్రోగం తో బాధ పడుతుంది.

నెలకు సుమారు 5 వేల విలువైన మందులు వాడుతున్నట్లు, మరో వైపు పిల్లల చదువు తో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మికులు, అఖిలపక్ష పార్టీ ల కార్యకర్తలు పెద్ద ఎత్తున హాస్పటల్ కు తరలివచ్చారు. తల్లి రోధించడం అందరిని కలిసివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కు చేరుకున్నారు.

ఆర్టీసీ డ్రైవర్ మృతదేహంతో డిపో నందు కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు:

ఆర్టీసీ డ్రైవర్ నరేష్ మృతి కి ప్రభుత్వ వైఫల్యం కారణమని అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నరేష్ ఆత్మహత్య చేసుకోవడానికి పది రోజుల ముందుగానే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. పది రోజుల ముందే సూసైడ్ నోటు రాసి పెట్టుకొని ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

నా చావుకు కెసిఆర్ కారణమంటూ ఆర్థిక ఇబ్బందులతో తమ కుటుంబం ఇబ్బంది పడుతుందని, దసరా పండుగ కూడా జరుపుకో లేదని తన ఆత్మహత్య చివరిది బలిదానం కావాలని నా అంత్యక్రియలకు అశ్వద్ధామ రెడ్డి హాజరు కావాలని లెటర్ లో పేర్కొన్నాడు, సూసైడ్ నోట్ 29. 10.2019 రోజున రాసినట్టు లెటర్లో డేట్ సైతం వేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతానికి మహబూబాద్ డిపో ముందు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది..