గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ చింతగట్టు వద్ద గల మహర్షి గోశాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సందర్శించారు. ఈ సందర్బంగా గోమాతకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా బాధిత కుటుంబాలు మరియు పేద వితంతువులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ: మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద వితంతువులు, కోవిడ్ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మహర్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలవాలని ట్రస్ట్ నిర్వాహకులను కోరారు. మహర్షి చారిటబుల్ ట్రస్ట్ కు ఎమ్మెల్యే గారు తనవంతుగా 25వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుగులోత్ దివ్యారాణి, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్, ట్రస్ట్ నిర్వాహకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.